బ్లాక్‌ ఫంగస్‌తో మహిళ మృతి
eenadu telugu news
Published : 17/09/2021 02:03 IST

బ్లాక్‌ ఫంగస్‌తో మహిళ మృతి

ఓదెల, న్యూస్‌టుడే: బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఓదెలలో విషాదం నింపింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మండలకేంద్రానికి చెదిన మాచర్ల తిరుమల(42) ఇటీవల జ్వరంతో రక్త కణాలు తగ్గి కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతుండగానే ఆమె కొవిడ్‌ బారిన పడింది. దీంతో చికిత్స పొంది నయం అవుతున్న సమయంలో బ్లాక్‌ ఫంగస్‌కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. చికిత్స కోసం రూ.10 లక్షల వరకు వెచ్చించినా ఫలితం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి భర్త, కూతురు, కుమారుడు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని