రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
eenadu telugu news
Published : 17/09/2021 02:03 IST

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

సురేష్‌

కాల్వశ్రీరాంపూర్‌: ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన కాలువలో పడి యువకుడు మృతి చెందిన ఘటన కాల్వశ్రీరాంపూర్‌లో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్‌ కథనం ప్రకారం మండలకేంద్రానికి చెందిన తాండ్ర సురేష్‌(32) ద్విచక్రవాహనంపై ఠాణా సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ఇంటికి వెళ్తున్న క్రమంలో నీలకంఠ చెరువు మలుపు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయాడు. గమనించిన స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సురేష్‌ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. కేసు నమోదు చేసి దర్యాపుఏ్త జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని