ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని.. యువతి బలవన్మరణం
eenadu telugu news
Updated : 30/07/2021 03:40 IST

ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని.. యువతి బలవన్మరణం

మృతి చెందిన అనూష

గోదావరిఖని, న్యూస్‌టుడే : తనకు నచ్చిన యువకునితో కాకుండా వేరే అబ్బాయితో వివాహం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మనస్తాపం చెందిన గుగ్గిళ్ల అనూష(19) అనే యువతి గురువారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని ఇల్లెందు బంగ్లా ఏరియాలోని ఉంటూ ప్రైవేటు పనిచేసుకుంటూ జీవించే అంజయ్యకు ఒక్కతే కూతురు.. బంధువుల అబ్బాయితో పెళ్లి నిశ్చయించారు. అతనికి ఉద్యోగం లేకపోగా మద్యం అలవాటు ఉండటంతో తల్లిదండ్రులు అతనితో వివాహన్ని రద్దు చేసుకున్నారు. మంచి అబ్బాయితో వివాహం చేయాలని నిర్ణయించుకున్న తల్లిదండ్రులు మరో యువకునితో వివాహం చేసేందుకు నిర్ణయించారు. దీనిపై మనస్తాపం చెందిన అనూష మొదట నిర్ణయించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అతను పని లేకుండా చెడు అలవాట్లకు బానిసయ్యాడని చెప్పారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ఇద్దరు పనులకు బయటకు వెళ్లారు. మధ్యాహ్నం భోజనానికి వచ్చిన తండ్రి ఇంట్లో పైకప్పునకు ఉరివేసుకుని ఉన్న కూతురును గమనించి చుట్టుపక్కల వారి సహాయంతో కిందకు దించాడు. అప్పటికే యువతి మృతి చెందింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒకటో పట్టణ ఎస్‌ఐ రమేశ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని