Updated : 21/04/2021 14:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్ పరీక్షలకు ‘ఆధార్’ వరుసలు

మెట్‌పల్లి గ్రామీణం: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ పరీక్షల కోసం పలువురు ఆధార్ కార్డులను వరుసలో ఉంచారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి కరోనా పరీక్షల కోసం ఎక్కువ సంఖ్యలో వస్తుండగా పీహెచ్‌సీలో కిట్ల లభ్యతను బట్టి 100 నుంచి 150 వరకు పరీక్షలు చేస్తున్నారు. తమ వంతు వచ్చేసరికి పరీక్షలు ముగుస్తుండటంతో కొందరు వెనుదిరగాల్సి వస్తోంది. దీంతో పరీక్షల కోసం ఉదయం 7 గంటలకే పీహెచ్‌సీకి చేరుకొని ఆధార్ కార్డులను ఇలా వరుసలో పెట్టారు. కిట్లను తగినంత అందుబాటులో ఉంచి పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని