Viveka murder case: ఇద్దరు అనుమానితులను విచారిస్తున్న సీబీఐ
eenadu telugu news
Published : 30/07/2021 14:28 IST

Viveka murder case: ఇద్దరు అనుమానితులను విచారిస్తున్న సీబీఐ

కడప: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో 54వ రోజు అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఇద్దరు అనుమానితులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన లోకేశ్, గోవర్దన్‌లను అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ అనే వ్యక్తి సీబీఐ విచారణ తీరుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతని పూర్వాపరాలు తెలుసుకునేందుకు సీబీఐ అధికారులు రెండు రోజుల కిందట సునీల్ బంధువు యువరాజ్‌ను వెంటబెట్టుకొని అనంతపురం వెళ్లి వచ్చారు. గతంలో సునీల్ కుటుంబం అనంతపురంలో ఉండేది. ఇందులో భాగంగానే ఇవాళ వారి బంధువులైన లోకేశ్, గోవర్దన్‌లను విచారిస్తున్నారు. మరోవైపు, పులివెందులకు చెందిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, అతని భార్య షబానాను సీబీఐ అధికారులు రాత్రి 10 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకుని ఇవాళ ఉదయం వదిలి పెట్టారు. విచారణలో భాగంగా వారిని తీసుకెళ్లినట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని