ts news: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై అప్పుడు సవాల్‌ చేయండి: కిషన్‌రెడ్డి
eenadu telugu news
Published : 23/10/2021 12:45 IST

ts news: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై అప్పుడు సవాల్‌ చేయండి: కిషన్‌రెడ్డి

హనుమకొండ: హుజూరాబాద్‌లో స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. ప్రచారంలో భాగంగా రోడ్‌ షో చేస్తుంటే దాన్ని అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. వారం ముందే దౌర్జన్యాలకు దిగితే పోలింగ్‌ రోజున ఎలా ఉంటుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోందని ఆరోపించారు. హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెరాస ఎంతగా అధికార దుర్వినియోగం, అసత్య ప్రచారం చేసినా భాజపా అభ్యర్థి గెలుపును అడ్డుకోలేరని చెప్పారు. తెరాస అధికారంలోకి వచ్చాకే ఎన్నికల్లో డబ్బుల పంచే సంస్కృతి మొదలైందని ఆరోపించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతూ ప్రజలపై కేంద్రం భారం మోపుతుందంటున్న తెరాస నేతలు.. రాష్ట్ర ఖజనాకు వాటి ద్వారా వచ్చే ఆదాయం తగ్గించుకొని తమపై సవాల్‌ చేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని