ద్విచక్ర వాహనంపై నుంచి పడి ఒకరి మృతి
eenadu telugu news
Published : 23/10/2021 05:47 IST

ద్విచక్ర వాహనంపై నుంచి పడి ఒకరి మృతి

ఎల్లయ్య

రామాయంపేట, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ రాజేష్‌ తెలిపిన వివరాలు.. రామాయంపేట పట్టణానికి చెందిన పుట్టి ఎల్లయ్య (50) మేస్త్రీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఓ పనిపై తన ద్విచక్ర వాహనంపై నిజాంపేట వైపు వెళ్లారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని వాహనం అదుపుతప్పి కిందపడగా అక్కడిక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని