గ్రామీణ ప్రాంతాల్లోనే అధికం
eenadu telugu news
Published : 23/10/2021 05:32 IST

గ్రామీణ ప్రాంతాల్లోనే అధికం

2,94,116 మందికి టీకాలు


వివరాలను నమోదు చేస్తున్న సిబ్బంది

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: న్యూస్‌టుడే, తాండూరు: ప్రతి ఒక్కరికి కరోనా టీకా వేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌ వేగంగా కొనసాగుతోంది. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా టీకాలు వేస్తున్నారు. జిల్లా జనాభా సుమారు 9.5 లక్షలు ఉండగా అందులో ఇప్పటి వరకు మొత్తం 2,94,116 మందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయిందని వైద్యారోగ్య శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఇందులో 30,388 మందికి రెండు డోస్‌లు ఇవ్వగా, 2,63,728 మంది తొలి డోసు తీసుకున్నారు. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రోజుకు కనీసం 25 వేల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 22, సామాజిక ఆరోగ్య కేంద్రాలు 4, జిల్లా ఆసుపత్రి, 138 సబ్‌ సెంటర్లు నుంచి సుమారు 400 మంది వైద్యారోగ్య శాఖ సిబ్బంది వ్యాక్సినేషన్‌లో పాల్గొంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో పది వేల మంది వరకు టీకా వేయాల్సి ఉండగా సుమారుగా వెయ్యి మంది మాత్రమే ముందుకొస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరో 15 వేల మందికి టీకా వేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తే, సుమారు 5 వేల మంది వరకు వస్తున్నారు. పట్టణాల్లో పురపాలక సిబ్బంది, గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది వైద్యారోగ్య శాఖకు సహకారం అందిస్తున్నారు. తాండూరు నియోజక వర్గంలో కరోనా నియంత్రణకు సంబంధించి టీకాలు వేసే ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా ఆసుపత్రిలోని పీపీయూనిట్‌లో ప్రత్యేకంగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని