‘రిటైనింగ్‌ బ్యాలెన్స్‌’ పుస్తకావిష్కరణ
eenadu telugu news
Published : 23/10/2021 02:57 IST

‘రిటైనింగ్‌ బ్యాలెన్స్‌’ పుస్తకావిష్కరణ


పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మురళీధర్‌రావు

సోమాజిగూడ, న్యూస్‌టుడే: భారత ఆర్థిక వ్యవస్థ, అందులో లోపాలతో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు న్యాయవాది ఎంఆర్‌ వెంకటేష్‌ రాసిన ‘రిటైనింగ్‌ బ్యాలెన్స్‌’ ద ఎటర్నల్‌ వే పుస్తకాన్ని శుక్రవారం రాత్రి సోమాజిగూడలోని క్షత్రియ హోటల్‌లో ఆవిష్కరించారు. ప్రజ్ఞాభారతి, హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి భాజపా నేత మురళీధర్‌రావు ముఖ్య అతిథిగా, ఆధ్యాత్మిక వేత్త స్వామి చిన్మయ కృష్ణదాస గౌరవ అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమ నిర్వాహక ప్రతినిధి మామిడి గిరిధర్‌ పుస్తక పరిచయం చేయగా మురళీధరరావు మాట్లాడుతూ.. దేశంలో ఉచితాలు ఇవ్వడం అంటే ఆర్జిస్తున్న వర్గాల నుంచి వసూలు చేసి ఇతరుల్ని సోమరుల్ని చేయడమేనని, దీంతో ఆర్థిక వ్యవస్థ పతనాన్ని ఎంతో కాలం పట్టదనే విషయాన్ని రచయిత పొందుపర్చారన్నారు. పుస్తకంలో అంశాలను పాలనలో అమలుచేయాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. రచయిత వెంకటేష్‌ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఇంటికే పరిమితం కావడం వల్ల సమయం లభించి పుస్తకం రాయగలిగానన్నారు. కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి ఛైర్మన్‌ హనుమాన్‌చౌదరి, అద్యక్షులు శిరీష్‌, హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ కవిత రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని