ఇంటర్‌ విద్యార్థులకు విద్యార్హత పత్రాలు ఇవ్వండి
eenadu telugu news
Published : 23/10/2021 02:57 IST

ఇంటర్‌ విద్యార్థులకు విద్యార్హత పత్రాలు ఇవ్వండి

కళాశాలల యాజమాన్యాలకు అదనపు కలెక్టర్‌ ఆదేశం

నాంపల్లి, న్యూస్‌టుడే: 2019-20, 2020-21లో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులకు తక్షణమే విద్యార్హత పత్రాలు అందజేయాలని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఉపకార వేతనాలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌ మంజూరు కాలేదన్న సాకుతో వాటిని ఆపకూడదని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాల దరఖాస్తులపై శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన పూర్తి కాపీలను అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్‌ 31లోపు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు. బీసీ, ఈబీసీకి సంబంధించి 2019-20కి గానూ 4,228 దరఖాస్తులు, 2020-21కి గానూ 16,581 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆశన్న, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని