రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి
eenadu telugu news
Published : 23/10/2021 02:57 IST

రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి

పెదనెమలిపురి(రాజుపాలెం), న్యూస్‌టుడే: బతుకుదెరువు కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో కుమార్తె మృతి చెందగా తల్లిదండ్రులు గాయపడిన ఘటన అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై గుంటూరు జిల్లా పెదనెమలిపురి వద్ద చోటుచేసుంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడికి చెందిన ఆర్‌.వెంకటేష్‌, నదియ హైదరాబాద్‌లో భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. ఇటీవల స్వగ్రామానికి వచ్చారు. శుక్రవారం చిన్న కుమార్తె ప్రత్యూష(6)తో కలిసి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. పెదనెమలిపురి వద్దకు రాగానే నిద్రలోకి జారుకోవడంతో అదుపు తప్పి విభాగినిని ఢీకొట్టారు. బాలిక కింద పడి తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. వెంకటేష్‌ శిరస్త్రాణం ధరించడంతో స్వల్ప గాయాలయ్యాయి. నదియా తలకు దెబ్బ తగిలింది. పోలీసులు క్షతగాత్రులను నకరికల్లు 108లో నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని