తల్లి దిన కార్యక్రమంలో తనయుడి మృతి
eenadu telugu news
Published : 23/10/2021 02:57 IST

తల్లి దిన కార్యక్రమంలో తనయుడి మృతి

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: తల్లి చనిపోయిన దుఖం తేరుకోక ముందే దిన కార్యక్రమం నిర్వహిస్తున్న తనయుడు చెరువులో మునిగి చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఏఎస్సై జగదీష్‌ వివరాల ప్రకారం.. పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌కు చెందిన మానెమ్మ చనిపోవడంతో పదకొండో రోజు గురువారం దిన కార్యక్రమం చేపట్టేందుకు కుమారుడు కృష్ణ(49) ఇస్నాపూర్‌ శివారులో ఉన్న సింగరాజ చెరువు వద్దకు చేరుకున్నాడు. గుండు గీయించుకునేందుకు తల తడుపుకోవడానికి కృష్ణ చెరువులోకి దిగి జారి మునిగిపోయాడు. అక్కడే ఉన్న అతని సోదరులు, బంధువులు ఎంత వెతికినా ఆచూకీ కన్పించలేదు. శుక్రవారం అతని మృతదేహం నీటిపై తేలింది. తల్లిపోయిన దుఖం నుంచి తేరుకోకముందే ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని