మురుగెత్తుతున్న శివార్లు.. పోటెత్తుతున్న ఫిర్యాదులు
eenadu telugu news
Published : 23/10/2021 02:10 IST

మురుగెత్తుతున్న శివార్లు.. పోటెత్తుతున్న ఫిర్యాదులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ శివారు మున్సిపాలిటీల నుంచి మురుగు సమస్యపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 20 రోజుల్లో 12 మున్సిపాలిటీల నుంచి 6600 ఫిర్యాదులు అందాయి. ఈ సమస్యల్లో 85 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్లు జలమండలి ఎండీ దానకిషోర్‌ తెలిపారు. శివారు పురపాలికల్లోని మురుగునీటి పారుదల వ్యవస్థను అక్టోబరు 1 నుంచి జలమండలి పరిధిలోకి తెచ్చిన నేపథ్యంలో సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లతో శుక్రవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఆయన సమీక్షించారు. మురుగు తరచూ పొంగే 792 ప్రదేశాలను గుర్తించి, సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రతి ప్రదేశానికి వేర్వేరుగా నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. సమీక్షలో రెవెన్యూ డైరెక్టర్‌ వీఎల్‌ ప్రవీణ్‌కుమార్‌, డైరెక్టర్‌(ఆపరేషన్స్‌-2) స్వామి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని