ప్రాథమిక తరగతులకు వీడియో పాఠాలు
eenadu telugu news
Published : 23/10/2021 02:10 IST

ప్రాథమిక తరగతులకు వీడియో పాఠాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాథమిక తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వీడియో పాఠాలను మేడ్చల్‌ జిల్లా విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేకంగా https://medchalbadi.com వెబ్‌సైట్‌లో పాఠాలు పొందుపరిచారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వీడియో పాఠాలు అందించే ఉద్దేశంతో గతేడాది ఉన్నత పాఠశాల మేడ్చల్‌బడి వెబ్‌సైట్‌ను విద్యాశాఖాధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకే పాఠాలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ పాఠాలు చేర్చారు. దీన్ని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు ఎ.శ్రీదేవసేన శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థులు నేరుగా ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎలాంటి పాస్‌వర్డ్‌ అవసరం లేకుండా పాఠాలు వినేందుకు వీలు కలగనుంది. తెలుగు, ఆంగ్లం, గణితం, ఈవీఎస్‌, ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్‌, కంప్యూటర్స్‌ పాఠాలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలు వీడియోల రూపంలో రూపొందించి పొందుపరిచారు. ప్రస్తుతం తెలుగు మాధ్యమంలోనే అందుబాటులోకి రాగా.. రానున్న రోజుల్లో ఆంగ్లం, ఉర్దూల్లోనూ పాఠాలు పొందుపరచనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని