TS News: ఎస్సై ఉద్యోగానికి నిందితుడి ఎసరు
eenadu telugu news
Updated : 23/10/2021 08:18 IST

TS News: ఎస్సై ఉద్యోగానికి నిందితుడి ఎసరు

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సై అడిగినట్టల్లా చేసి చివరకు ఉద్యోగానికే ఎసరు తెచ్చాడో నిందితుడు. పోలీస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ ఘటన రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఓ ఠాణాలో ఓ నిందితుడిపై కేసు నమోదవగా సదరు ఎస్సై (దర్యాప్తు అధికారి) పరిచయమయ్యాడు. అనతి కాలంలోనే ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. ఆ ఎస్సై కుటుంబంతో కలిసి విజయవాడకు విహారయాత్రకు వెళ్లాడు. ఆ సమయంలో నిందితుడు ఖరీదైన హోటల్‌లో బస ఏర్పాటు చేశాడు. రవాణా, భోజనం, ఇతరత్రా ఖర్చులను భరించి ఎలాంటి లోటు రానీయకుండా చూసుకున్నాడు. ప్రతి బిల్లును భద్రపర్చుకున్నాడు. ముందుజాగ్రత్తగా ఎస్సైతో ఎక్కడికెళ్లినా అక్కడ ఫొటోలు కూడా దిగాడు. అయితే అధికారాన్ని వినియోగించుకుని తనను బెదిరించాడంటూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. తన వద్ద ఆధారాలు జత చేశాడు. పూర్తిస్థాయిలో విచారించి ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత ఉన్నతాధికారులకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఎస్సై నిందితుడితో రాజీ చేసుకున్నట్లు చెప్పడంతో ఉన్నతాధికారులు వెనక్కి తగ్గారు. అయినా నిందితుడు ఊరుకోలేదు. ఇంకా చర్యలు తీసుకోలేదంటూ మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో సస్పెండ్‌ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని