Ganesh Immersion: వినాయక నిమజ్జనం: 40 క్రేన్లు.. విధుల్లో 19వేల మంది పోలీసులు
eenadu telugu news
Published : 17/09/2021 18:08 IST

Ganesh Immersion: వినాయక నిమజ్జనం: 40 క్రేన్లు.. విధుల్లో 19వేల మంది పోలీసులు

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి జంట నగరాల పరిధిలో గణేశ్‌ మహానిమజ్జన ఉత్సవాలు శోభాయమానంగా నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. నగరంలోని ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో నిమజ్జన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేష్ కుమార్, సీపీ అంజనీకుమార్‌, పలు శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈసారి ట్యాంక్ బండ్‌పై 40 క్రేన్ల ద్వారా గణేశ్‌ ప్రతిమలు నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశామని.. ఖైరతాబాద్ గణనాథున్ని క్రేన్ నంబర్ 6 వద్ద నిమజ్జనం చేయనున్నట్లు చెప్పారు. హైకోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని తలసాని పేర్కొన్నారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు 19వేల మంది పోలీసులు, ఆరోగ్య, సానిటరీ సిబ్బంది, ఆర్అండ్‌బీ, హెచ్ఎండీఏ సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జనాలను నిర్వహిస్తామని.. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని