Fire Accident: పెద్ద అంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం
eenadu telugu news
Updated : 17/09/2021 13:27 IST

Fire Accident: పెద్ద అంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగర శివారు పెద్ద అంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్వాల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లో మంటలు తీవ్రరూపం దాల్చాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో సమీప ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలముకున్నాయి. గోదాములో భారీ శబ్దాలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని