సర్కారులో ఎక్కువ.. ప్రైవేటులో తక్కువ
eenadu telugu news
Published : 17/09/2021 02:34 IST

సర్కారులో ఎక్కువ.. ప్రైవేటులో తక్కువ

మెరుగుపడుతున్న విద్యార్థుల హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు మెరుగుపడుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌లో బోధిస్తుండడం, పూర్తి స్థాయిలో అన్ని తరగతులు ప్రారంభం కాకపోవడంతో హాజరు శాతం తక్కువగా కనిపిస్తోంది. ఈనెల ఒకటో తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు విభాగంలో 7,451 పాఠశాలలున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్‌, స్థానిక సంస్థల పరిధిలోని పాఠశాలలన్నీ తెరుచుకోగా.. ప్రైవేటులో పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ప్రాథమిక తరగతులకు విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు అంతగా ఇష్టపడటం లేదని ట్రస్మా హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు వివరించారు.

ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌, టీవీ పాఠాలను సెప్టెంబరు ఒకటి నుంచి ప్రభుత్వం నిలిపివేసింది. విద్యార్థులు పూర్తి స్థాయిలో హాజరు కావాల్సిన పరిస్థితి. ఈ ఏడాది సర్కారీ బడుల్లో ప్రవేశాలు భారీగా పెరిగాయి. మేడ్చల్‌ జిల్లాలో అధికంగా 60.72 హాజరు శాతం ఉండగా.. హైదరాబాద్‌లో 42.56 శాతం, రంగారెడ్డిలో 52.75 శాతంగా ఉంది.

* హైదరాబాద్‌ జిల్లాలో 684 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 83,841 మంది చదువుతున్నారు. గురువారం 35,684 మంది హాజరయ్యారు.

* మేడ్చల్‌ జిల్లాలో 505 పాఠశాలల్లో 60,153 మంది విద్యార్థులుండగా 36,527 హాజరయ్యారు.

* రంగారెడ్డి జిల్లాలో 1307 పాఠశాలల్లో 1,36785 మంది చదువుతుండగా 72,149 మంది హాజరయ్యారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని