జూద గృహంపై దాడి.. రూ.90.43 లక్షల జప్తు
eenadu telugu news
Published : 17/09/2021 02:29 IST

జూద గృహంపై దాడి.. రూ.90.43 లక్షల జప్తు

రాయదుర్గం, న్యూస్‌టుడే: మణికొండలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఓ జూద గృహంపై మాదాపూర్‌ జోన్‌ ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి నిర్వాహకుడితోపాటు 12 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. నిర్వాహకుడు పోలీసులకు దొరకకుండా నెట్‌ బ్యాంకిగ్‌ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. జూదానికి సంబంధించి రూ.90.43 లక్షలు ఫ్రీజ్‌ చేశారు. డీసీపీ (ఎస్‌ఓటీ) సందీప్‌ కథనం ప్రకారం.. మణికొండ సీబీఆర్‌ రెసిడెన్సీలో నివసించే సీజే నీరజ్‌ కుమార్‌ (33) అదే ప్రాంతంలోని ప్రిస్టిన్‌ కమ్యూన్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఓ ఫ్లాట్‌ అద్దెకు తీసుకున్నాడు. పోలీసులు దాడి చేసినా దొరకకుండా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా లావాదేవీలను నడిపేవాడు. జూదానికి సంబంధించి బ్యాంకులో ఉన్న రూ.90.34 లక్షలు ఫ్రీజ్‌ చేశారు. 19 చరవాణులు, ఆరు కార్లు జప్తు చేశారు. అరెస్టయిన వారిలో వ్యాపారులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌లున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని