‘అమృతం’ కన్నా ఆస్తే మిన్నని..
eenadu telugu news
Published : 17/09/2021 02:29 IST

‘అమృతం’ కన్నా ఆస్తే మిన్నని..

 పొలంలో వాటా అడిగిందని సోదరి హత్యకు అన్న కుట్ర

శంకర్‌పల్లి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: ఆస్తిలో వాటా అడుగుతున్న చెల్లెలి హత్యకు కుట్ర పన్నాడు ఓ సోదరుడు. చెల్లి మరిదితో రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతడు ఆలస్యం చేయడంతో తనకు వరసకు కొడుకయ్యే యువకుడితో కలిసి చెల్లి మరిదిని కిరాతకంగా హత్య చేశాడు. చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ మహేష్‌గౌడ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం దొంతాన్‌పల్లికి చెందిన అమృత(37)కు 23ఏళ్ల క్రితం మహాలింగపురం గ్రామానికి చెందిన రాములుతో వివాహం జరిగింది. 13 ఏళ్ల క్రితం రాములు మృతి చెందాడు. అమృత అన్న అశోక్‌(40) రైతు. సుమారు రూ.18 కోట్లు పలికే 2ఎకరాల 8గుంటల భూమిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా.. చెల్లెలు వాటా కావాలని అడిగింది. ఈ క్రమంలో అమృత మరిది (భర్త తమ్ముడు) వెంకటయ్య(42) జోక్యం చేసుకున్నాడు. వరుసకు బావ అయ్యే వెంకటయ్యతో అశోక్‌ అమృతను హత్య చేసేందుకు రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దఫదఫాలుగా రూ.4లక్షల వరకు ఇచ్చాడు. డబ్బు తీసుకుని నెలలు గడుస్తున్నా హత్య చేయకపోవడంతో అశోక్‌.. ఈనెల 11న అర్ధరాత్రి వెంకటయ్యకు ఫోన్‌చేసి మరింత డబ్బు ఇస్తానంటూ శంకర్‌పల్లికి రావాలని కోరాడు. ద్విచక్ర వాహనంపై వచ్చిన వెంకటయ్యను అలంఖాన్‌గూడ సమీపంలోని శుభగృహ వెంచర్‌ వద్ద సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం రెండ్లపల్లి గ్రామానికి చెందిన పవన్‌(20)తో కలిసి కత్తులతో నరికి హత్య చేశారు. కాల్‌ డేటా ఆధారంగా నిందితులను బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని