భక్తుల సేవలో పోలీసులు
eenadu telugu news
Published : 17/09/2021 02:29 IST

భక్తుల సేవలో పోలీసులు

రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌

నాగోలు, న్యూస్‌టుడే: ఈనెల 19న గణేష్‌ నిమజ్జనోత్సవానికి కమిషనరేట్‌ పరిధిలోని చెరువుల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. గురువారం కమిషనరేట్‌ పోలీసులతో చైతన్యపురిలో ఏర్పాటుచేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. బయటి నుంచి అదనపు బలగాలు వచ్చాయన్నారు. వీలైనంత త్వరగా నిమజ్జనం ముగించాలన్నారు. ఆ రోజు మద్యం అమ్మకాలపై నిఘా ఉంటుందన్నారు. డీసీపీలు సన్‌ప్రీత్‌సింగ్‌, రక్షితామూర్తి, యాదగిరి, శ్రీనివాస్‌, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని