ఇనుప స్తంభాలకు ప్లాస్టిక్‌ తొడుగు
eenadu telugu news
Published : 17/09/2021 02:29 IST

ఇనుప స్తంభాలకు ప్లాస్టిక్‌ తొడుగు

డిస్కం సీఎండీ జి.రఘుమారెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతివ్వడంతో విద్యుత్తు పంపిణీ సంస్థ ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. జంట నగరాల్లో శోభాయాత్ర జరిగే మార్గంలోని 24 ముఖ్యమైన ప్రాంతాల్లో సీజీఎం, ఎస్‌ఈ స్థాయి అధికారులను ఇన్‌ఛార్జిలుగా నియమించింది. హుస్సేన్‌సాగర్‌, సర్దార్‌ మహల్‌, బషీర్‌బాగ్‌, గాంధీనగర్‌, సరూర్‌నగర్‌లలో కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేయనుంది. తమ పరిధిలో పెద్ద విగ్రహాలు ప్రతిష్ఠించిన మండపాలను, శోభాయాత్ర నిర్వహించే వీధులు, రహదారులను తప్పనిసరిగా తనిఖీ చేసి, ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని డివిజన్‌ ఇంజినీర్లు, సూపరింటెండింగ్‌ ఇంజినీర్లను దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ సీఎండీ గౌరవరం రఘుమారెడ్డి ఆదేశించారు. చెరువుల వద్ద నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు విద్యుత్తుపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జె.శ్రీనివాస్‌రెడ్డి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. సాగర్‌ పరిధిలో నిమజ్జనం 24 గంటలకుపైగా కొనసాగే అవకాశం ఉండటంతో ప్రాంతాలవారీగా ఒక్కో డిస్కం డైరెక్టర్‌ను పర్యవేక్షకులుగా నియమించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని