లిబ్సన్‌ పబ్‌ యజమాని లొంగుబాటు
eenadu telugu news
Published : 17/09/2021 02:29 IST

లిబ్సన్‌ పబ్‌ యజమాని లొంగుబాటు


మురళి

పంజాగుట్ట, న్యూస్‌టుడే: హత్యాయత్నం కేసులో నిందితుడైన లిబ్సన్‌ పబ్‌ యజమాని మురళి గురువారం నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ఇటీవల పంజాగుట్టలోని పబ్‌కు వచ్చిన ఇద్దరిపై దాడి చేసి గాయపరచిన ఘటనలో ఆయన ప్రధాన నిందితుడు. ఈ ఘటనలో పంజాగుట్ట పోలీసులు ఇతర నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మురళి పరారీలో ఉన్నాడు. ఆయన నిర్వహిస్తున్న మూడు పబ్‌లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండటంతో కేసులు నమోదయ్యాయి. పలుమార్లు తాఖీదులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో ఆయా పబ్‌లను ఇటీవల పోలీసులు సీజ్‌ చేశారు. దీంతో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో మురళి లొంగిపోయినట్లు తెలుస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని