చిత్రవార్తలు
eenadu telugu news
Published : 17/09/2021 02:29 IST

చిత్రవార్తలు

రోడ్డు ప్రమాదంలో గాయపడి జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్‌తేజ్‌ను సినీ నటుడు అల్లు అర్జున్‌ గురువారం పరామర్శించారు.

-న్యూస్‌టుడేే, ఫిలింనగర్‌


‘గణం’గా ముస్తాబు: గణేశ్‌ మహాయాత్ర కోసం రథాలు ముస్తాబయ్యాయి. నిమజ్జన సమయంలో గణనాథుల్ని సంప్రదాయ బద్దంగా తీసుకువెళ్లేందుకు పలువురు ఆసక్తి చూపుతుంటారు. అందుకోసం పురానాపూల్‌ వద్ద వరుసగా ఉన్న అద్దె రథాలు ఇవి.


అయ్య బాబోయ్‌..: అకస్మాత్తుగా చూసి పెద్ద దున్న తలను ఇలా పబ్లిగ్గా స్కూటర్‌పై తీసుకువెళుతున్నారని అనుకుని భయపడేరు? ఇది బొమ్మ. ఏదో సినిమా షూటింగ్‌ కోసం తీసుకువెళుతూ ఫిల్మ్‌నగర్‌ వద్ద ఇలా కనిపించారు.


బతుకు బాటపై..: గణేశ్‌ నిమజ్జనాల సమయం..  డప్పు కొడితే  అంతోఇంతో సంపాదించుకోవచ్చన్నది  వీరి ఆరాటం.  మెదక్‌, సిద్దిపేట జిల్లాలకు చెందిన కళాకారులు సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానం వద్ద ఇలా ఎదురుచూస్తూ కనిపించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని