జేఈఈ మెయిన్‌లో అంధ విద్యార్థికి 70వ ర్యాంకు
eenadu telugu news
Published : 17/09/2021 02:29 IST

జేఈఈ మెయిన్‌లో అంధ విద్యార్థికి 70వ ర్యాంకు

రిత్విక్‌ రామ్‌

అంబర్‌పేట, న్యూస్‌టుడే: జేఈఈ మెయిన్‌ ర్యాంకుల్లో అంబర్‌పేట తిరుమలనగర్‌కు చెందిన అంధ విద్యార్థి ఉప్పర రిత్విక్‌ రామ్‌ సత్తా చాటారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో 87.43 పర్సంటైల్‌ సాధించిన అతడు దివ్యాంగుల ఓబీసీ కోటాలో ఆలిండియా 70వ ర్యాంకు, దివ్యాంగుల జనరల్‌ కోటాలో 223వ ర్యాంకు సాధించాడు. స్థానిక స్లేట్‌ స్కూల్‌లో పదో తరగతి, సెయింట్‌ ప్యాట్రిక్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాడు. తమ కుమారుడి విజయంపై తల్లిదండ్రులు ఉపేంద్ర, నళిని, సోదరుడు గగన్‌సాయి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం రిత్విక్‌రామ్‌కు మిఠాయి తినిపించి వేడుకలు నిర్వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని