TS News : ఆగస్టు 31లోపు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి
eenadu telugu news
Published : 30/07/2021 16:01 IST

TS News : ఆగస్టు 31లోపు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి

హైదరాబాద్‌ : గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్ల కెపాసిటీకి తగిన మొత్తంలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయని ఆస్పత్రుల గుర్తింపును రద్దు చేయనున్నట్లు హెచ్చరించింది.ఆగస్టు 31వ తేదీ లోపు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేయాలని పేర్కొంది.200 బెడ్స్‌ వరకు ఉన్న ఆస్పత్రుల్లో 500 ఎల్‌పీఎం, 200 నుంచి 500 బెడ్స్ ఉన్న ఆస్పత్రుల్లో 1000 ఎల్‌పీఎం, 500 కంటే అధికంగా బెడ్స్ ఉన్న ఆస్పత్రుల్లో  2000 ఎల్‌పీఎం కెపాసిటీ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని