TS Congress: మాకు కావాల్సింది ఉద్యోగాలు.. గొర్రెలు, బర్రెలు కాదు
eenadu telugu news
Updated : 24/07/2021 16:10 IST

TS Congress: మాకు కావాల్సింది ఉద్యోగాలు.. గొర్రెలు, బర్రెలు కాదు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలను అవమానిస్తున్నారంటూ మహిళా కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తట్టా, పార, చీపుర్లు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళల ఉపాధి అవకాశాలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. తమకు గొర్రెలు, బర్రెలు కాదని.. ఉద్యోగాలు కావాలంటూ నినదించారు. సరిగ్గా చదువుకోని వారంతా మంత్రివర్గంలో ఉన్నారని కానీ, చదువుకున్న వారు మాత్రం రోడ్లపై ఉన్నారని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే దళితబంధు ఇస్తున్నారని ఆమె విమర్శించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ‘మహిళా బంధు’ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో వేలాది మందికి ఉద్యోగాలు పోయాయని.. కొత్త ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించిన మహిళా కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని