తోటకు ఎమ్మెల్సీ ఎంతవరకు సమంజసం: ముప్పాళ్ల
eenadu telugu news
Published : 17/09/2021 06:30 IST

తోటకు ఎమ్మెల్సీ ఎంతవరకు సమంజసం: ముప్పాళ్ల

మాట్లాడుతున్న ముప్పాళ్ల సుబ్బారావు

కాకినాడ నగరం: దళిత యువకుడికి శిరోముండనం చేయించిన తోట త్రిమూర్తులుకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ప్రశ్నించారు. కాకినాడలోని ర.భ.శాఖ అతిథిగృహ ఆవరణలో గురువారం బొజ్జా తారకం సంస్మరణ సభ నిర్వహించారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు రామేశ్వరరావు అధ్యక్షతన సుబ్బారావు ప్రసంగించారు. మేధావులు, నిపుణులకు ఇవ్వాల్సిన పదవిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఇవ్వడమేంటన్నారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, సీనియర్‌ న్యాయవాదులు సాలార్‌, సూర్యనారాయణ, నేతలు చొల్లంగి వేణుగోపాల్‌ తదితరులు తారకం సేవలను కొనియాడారు. ‘కులం-వర్గం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పలు తీర్మానాలను ఆమోదించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని