డీసీసీబీ మొబైల్‌ ఏటీఎంలు
eenadu telugu news
Published : 17/09/2021 06:30 IST

డీసీసీబీ మొబైల్‌ ఏటీఎంలు


సేవలు ప్రారంభిస్తున్న ఆకుల వీర్రాజు

మసీదుసెంటర్‌(కాకినాడ): నాబార్డ్‌ సౌజన్యంతో వచ్చిన రెండు మొబైల్‌ ఏటీఎంలను బ్యాంక్‌ ఛైర్మన్‌ ఆకుల వీర్రాజు కాకినాడలోని డీసీసీబీ ఆవరణలో గురువారం ప్రారంభించారు. వాటిని అమలాపురం, రాజమహేంద్రవరం డివిజన్లలో ఉపయోగించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అనంతరం బ్యాంకులో పనిచేస్తున్న మెసెంజర్లకు యూనిఫారాలు పంపిణీ చేశారు. చేనేత సంఘాల అధ్యక్షులు, సెక్రటరీలు వీర్రాజును సత్కరించారు. మధ్యాహ్నం బ్యాంకు మేనేజర్లు, సూపర్‌వైజర్లు, సీఈవోలతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఛైర్మన్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని, డిపాజిట్‌లతో పాటు వసూళ్లు పెంచాలని, ఎన్‌పీఏలు తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్‌లూమ్స్‌ ఏడీ, నాబార్డ్‌ డీడీఎం సోమినాయుడు, బ్యాంకు సీఈవో ప్రవీణ్‌కుమార్‌, ఇతర అధికారులు హాజరయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని