26న పళ్లవారిపాలెంలో దేహదారుఢ్య పోటీలు
eenadu telugu news
Published : 17/09/2021 06:30 IST

26న పళ్లవారిపాలెంలో దేహదారుఢ్య పోటీలు

గడియార స్తంభం: స్పోర్ట్స్‌ అథారిటీ, జిల్లా ఒలింపిక్‌ సంఘం గుర్తింపు పొందిన ‘ది ఈస్ట్‌ గోదావరి బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌’ అమలాపురం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26న 5వ జిల్లాస్థాయి దేహదారుఢ్య పోటీలను ముమ్మిడివరం మండలం పళ్లవారిపాలెం రారాజు జిమ్‌, స్పోర్ట్స్‌ అకాడమీ ఆవరణలో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు గురువారం తెలిపారు. క్రీడాకారులు 92472 92794 నంబర్‌కు వాట్సాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచినవారికి నగదు పురస్కారాలు, మిగిలినవారికి ధ్రువపత్రాలు అందిస్తామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని