కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్రం: ఐఎఫ్‌టీయూ
eenadu telugu news
Published : 17/09/2021 06:30 IST

కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్రం: ఐఎఫ్‌టీయూ

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరిస్తోందని, 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను కట్టుబానిసలుగా చేసే విధాలనాలతో ముందుకెళ్తోందని ఐఎఫ్‌టీయూ జాతీయ కార్యదర్శి పి.ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా గురువారం రాజమహేంద్రవరంలోని విక్రమ హాలులో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర సదస్సులో ప్రసాద్‌ ప్రసంగించారు. పలు సంఘాల నేతలు దుర్గాప్రసాద్‌, శ్రీమన్నారాయణ, పోలారి, వెంకటేశ్వరరావు, ఎ.వి.రమణ, కె.జోజి, జె.సత్తిబాబు, వెంకట్‌నాయుడు తదితరులు మాట్లాడారు. అనంతరం సదస్సులో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని