జి.దొంతమూరులో తవ్వకాలపై రీ సర్వే
eenadu telugu news
Published : 17/09/2021 06:30 IST

జి.దొంతమూరులో తవ్వకాలపై రీ సర్వే


హాజరైన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, డీడీ నరసింహారెడ్డి

రంగంపేట: హైకోర్టు ఆదేశాల మేరకు జి.దొంతమూరులోని చుక్కమ్మ-చుక్కరాయుడు కొండపై గురువారం అధికారుల బృందం రీ సర్వే ప్రారంభించింది. కాకినాడ గనులు, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టరు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు రీ సర్వే చేపట్టారు. గతంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై సర్వే చేపట్టగా సుమారు రూ.6.5 కోట్ల వరకు జరిమానా విధించారు. సమగ్ర దర్యాప్తు చేస్తే ఈ మొత్తం పెరుగుతుందన్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విన్నపంతో హైకోర్టు రీ సర్వేకు ఆదేశించింది. నల్లమిల్లి అధికారులతో పలు అంశాలపై చర్చించి.. వారి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వివాదాలు తలెత్తకుండా సీఐ జయకుమార్‌, ఎస్సై టి.రామకృష్ణ ఆధ్వర్యంలో గస్తీ నిర్వహించారు.

అధికారులు రీ సర్వేను ప్రారంభించినా నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని నల్లమిల్లి విమర్శించారు. మైన్స్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్సు అధికారులకు సరైన అవగాహన లేకపోవడం దారుణమన్నారు. రీ సర్వే సక్రమంగా జరగకపోతే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని