నేలవరిగిన ఆశలు
eenadu telugu news
Published : 17/09/2021 06:30 IST

నేలవరిగిన ఆశలు

ఈ చిత్రంలో ఉన్న కౌలు రైతు పేరు దండమూడి శ్రీరామమూర్తి. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం బొమ్మూరు రైతు. అయిదెకరాల్లో రూ.లక్ష పెట్టుబడితో నాట్లు వేశారు. తాజాగా కురిసిన వర్షాలకు మూడెకరాల పంట నీట మునిగి కుళ్లింది. మరో రూ.లక్ష కౌలు చెల్లించాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వ్యవసాయాధికారి రాహుల్‌ను వివరణ కోరగా.. బొమ్మూరు సమీపంలో జాతీయ రహదారి కల్వర్టు నుంచి నీరు కిందకు వెళ్లక పోవడంతో పొలాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు పంపుతామన్నారు.-ఈనాడు, రాజమహేంద్రవరం

 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని