‘రైతుహక్కులను కాలరాస్తునా్నరు’
eenadu telugu news
Published : 17/09/2021 06:30 IST

‘రైతుహక్కులను కాలరాస్తునా్నరు’


నాగలి పట్టిన ఎమ్మెల్యే గోరంట్ల, పక్కన మాజీ మంత్రి జవహర్‌

కడియం, దానవాయిపేట: నాణ్యమైన విద్యుత్తు పేరుతో మీటర్లు బిగింపు, సూక్ష్మసేద్యం రాయితీల ఎత్తి వేత, ఎరువులు ధరల పెంపుతో రైతుల హక్కులను వైకాపా ప్రభుత్వం కాలరాస్తోందనిరాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. కడియంలో గురువారం ‘రైతు కోసం తెలుగుదేశం’ కార్యక్రమం పోలీసుల ఆంక్షల మధ్య కొనసాగింది.ఎమ్మెల్యే గోరంట్ల,మాజీ మంత్రి జవహర్‌, తెదేపా శ్రేణులు రాజమహేంద్రవరం నుంచి కడియానికి వాహనాలతో ర్యాలీగా బయలుదేరారు. రైతుల ట్రాక్టర్లను బొమ్మూరు పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో ఎమ్మెల్యే స్టేషన్‌కెళ్లి పోలీసులతో మాట్లాడారు. కడియం పోలీసుస్టేషన్‌ వద్ద బారికేడ్లతో అడ్డుకున్నారు. గోరంట్ల, జవహర్‌ రైతులతో కలిసి బైఠాయించారు. అనంతరం తహసీల్దారు భీమారావుకు విన్నవించారు.నాయకులు సత్యప్రసాద్‌, చంటి, సత్యనారాయణ, ప్రసాద్‌, రాంబాబు, వాసుదేవ్‌, హనుమంతరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

●కార్యక్రమంలో పాల్గొన్న నాయకులపై కడియం పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే గోరంట్ల, జవహర్‌తో పాటు మరో 25 మందిపై కేసులు నమోదయ్యాయాయి. దీనిపై బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఈ కేసులపై పార్టీ పెద్దలతో చర్చించి న్యాయస్థానంలో పోరాడతామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని