మహిళా మేయర్‌పై ఇంత కుట్రా?: పావని
eenadu telugu news
Published : 17/09/2021 06:30 IST

మహిళా మేయర్‌పై ఇంత కుట్రా?: పావని

●●● అవమానిస్తున్న ఎమ్మెల్యేను ప్రభుత్వం ప్రశ్నించాలి

 

●●● అవినీతిని అడ్డుకుంటున్నామనే తప్పించే ప్రయత్నాలు

ఈనాడు - కాకినాడ: ‘మహిళలకు పెద్దపీట వేసి.. అన్ని రంగాల్లో వారిని ముందుకు తీసుకెళ్తున్నామని వైకాపా ప్రభుత్వం చెబుతోంది. కాకినాడలో మహిళా మేయర్‌ను ఇంత అవమానిస్తున్న వాళ్ల ఎమ్మెల్యేను ప్రభుత్వం ప్రశ్నించాలని..’ కాకినాడ నగర పాలక సంస్థ మేయర్‌ సుంకర పావని వ్యాఖ్యానించారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండేళ్లుగా మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారనీ.. ఎన్నో అవమానాలకు తలవంచుకుని బాధ్యతలు నిర్వర్తించానని ఆవేదన వ్యక్తంచేశారు. మేయర్‌పై అవిశ్వాస వ్యూహంలో భాగంగా రహస్య సమావేశం.. తాజా పరిణామాలపై ఆమె గురువారం స్పందించారు. కొద్దిరోజులుగా కాకినాడలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని పావని అన్నారు. నాలుగేళ్లలో కాకినాడ అభివృద్ధికి కృషిచేశాననీ.. నగర ప్రజల మన్ననలతో చక్కగా పనిచేశానన్న తృప్తి తనకు ఉందన్నారు. రాబోయే ఏడాదిలో వారు చేసే అవినీతికి అడ్డుపడతామనే ఉద్దేశంతో వైకాపా కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్ఢి. ప్రత్యేక కుట్రతో తమను పదవి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెదేపా కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురిచేసి వారివైపు తిప్పుకొన్నారనీ.. వారితో సంతకాలు సైతం చేయించుకున్నారని ఆరోపించారు. అత్యధిక మెజార్టీతో ప్రజల మన్ననలతో గెలిచిన తనను ఈరోజు ఏ అధికారంతో తప్పిస్తారో చెప్పాలని పావని ప్రశ్నించారు. కేవలం అధికార దుర్వినియోగంతో మార్చాలని యత్నిస్తున్నారని.. ప్రజలు గమనించాలని కోరారు. గతంలోనూ బీసీ మహిళా మేయర్‌ను ఇలాగే ఇబ్బందిపెట్టారని వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని