నిండా నీరు.. నిర్మాణమెలా సారు?
eenadu telugu news
Published : 17/09/2021 06:30 IST

నిండా నీరు.. నిర్మాణమెలా సారు?


బలుసుతిప్పలో 5 అడుగుల మేర నిలిచిన నీటి లోతును చూపుతున్న గ్రామస్థుడు

కాట్రేనికోన మండలంలోని బలుసుతిప్ప, రామాలయంపేట, గాజింగితిప్ప, అడవిపేట, పల్లం, సత్తమ్మచెట్టు తదితర చోట్ల లోతట్టు ప్రాంతాలను ఇళ్ల స్థలాలకు కేటాయించారు. చెరువులా నీరుండటంతో స్థానికులు వాపోతున్నారు. ఇప్పటివరకు స్థానిక అధికారులు మట్టితో మెరక చేసే పనులు చేపట్టలేదు. గురువారం ఆయా ప్రాంతాల్లో పర్యటించిన జేసీ(హౌసింగ్‌) భార్గవ్‌తేజ, హౌసింగ్‌ పీడీ విశ్వేశ్వరప్రసాద్‌, ఆర్డీవో వసంతరాయుడుకు స్థానికులు నీటిలోకి దిగి లోతు చూపించారు. ముందుగా మూడడుగుల మేర మట్టి నింపాలని జేసీ సూచించగా.. గుత్తేదారులు ముందుకు రావడం లేదని అధికారులు వివరించారు. -న్యూస్‌టుడే, కాట్రేనికోన


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని