బెదిరించి.. నగదు దోచుకుని.. 
eenadu telugu news
Updated : 17/09/2021 11:48 IST

బెదిరించి.. నగదు దోచుకుని.. 


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ, సీఐ

 

రాజమహేంద్రవరం నేరవార్తలు: ఆ నలుగురు ఆకతాయిలు. మద్యానికి బానిసలు. రోడ్డున వెళ్లేవారిని బెదిరించి దోచుకుంటారు... దౌర్జన్యాలకు పాల్పడుతుంటారు. వారిపై అర్బన్‌ పరిధిలోని పలు స్టేషన్లలో కేసులూ ఉన్నాయి. ఓ దాబా యజమానిని బెదిరించి నగదు దోచుకున్న ఘటనలో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్‌ జోన్‌ డీఎస్పీ రవికుమార్‌ వెల్లడించిన వివరాలు ప్రకారం.. నగరంలోని అన్నపూర్ణమ్మపేటకు చెందిన పి.శ్రీకర్‌, కె.బంగారుసాయి, పి.నవీన్‌, జాంపేటకు చెందిన టి.సూరిబాబు పాత నేరస్థులు. ఈ నెల 15న ఈ నలుగురిలో ఒకరి పుట్టినరోజు కావడంతో దివాన్‌చెరువు జాతీయ రహదారిపై మధ్యాహ్నం కేకు, మద్యంతో పార్టీ చేసుకున్నారు. సాయంత్రానికి స్థానికంగా ఓ దాబా వద్దకు వెళ్లి వారికి కావాల్సిన పదార్థాలను తిన్నారు. బిల్లు అడిగే సరికి చాకు చూపించి దౌర్జన్యం చేశారు. యజమాని సత్తి కాశిరెడ్డిని కత్తితో పొడుస్తామని బెదిరించి కౌంటర్‌లో ఉన్న రూ.వెయ్యి తీసుకుని ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. బాధితుడు బొమ్మూరు పోలీసులను ఆశ్రయించడంతో సీఐ లక్ష్మణ్‌రెడ్డి, ఎస్సై జగన్‌ మోహన్‌ గురువారం పాలచర్ల రోడ్డులోని చెరువువద్ద నిందితులను అరెస్టు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని