బోటు దగ్ధం
eenadu telugu news
Published : 17/09/2021 06:30 IST

బోటు దగ్ధం


ఘటనాస్థలంలో ఎగసిపడుతున్న మంటలు

మసీదుసెంటర్‌(కాకినాడ): జగన్నాథపురంలోని ఉప్పుటేరులో పాలెపు జయప్రకాష్‌కు చెందిన బోటును కొవిడ్‌ నేపథ్యంలో కొన్నాళ్లుగా తిప్పలేదు. వేటకు వెళ్లేందుకు సిద్ధం చేస్తుండగా గురువారం సాయంత్రం ఇంజిన్‌ నుంచి ఒక్కసారిగా మంటలొచ్చి పొగకమ్ముకుంది. జగన్నాథపురం, కాకినాడ నుంచి రెండు ఫైర్‌ ఇంజిన్లు తెచ్చి మంటల్ని అదుపుచేశామని జిల్లా అగ్నిమాపక అధికారి రత్నబాబు తెలిపారు. బోటులోని మత్స్యకారులు, సిబ్బంది అందులోనుంచి బయటపడడంతో ప్రాణనష్టం తప్పింది. వలలు, ఇతర సామగ్రి కాలి రూ.30లక్షల వరకు ఆస్తినష్టం సంభవించిందన్నారు. బోటులో గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయని, అవి పేలడంతో భారీస్థాయిలో మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని కాకినాడ డీఎస్పీ భీమారావు, ఒకటో పట్టణ సీఐ రామ్మోహన్‌రెడ్డి, మత్స్యశాఖ ఏడీ వెంకటేశ్వరరావు తదితరులు సందర్శించారు. ఈ ప్రమాదంలో భైరవపాలేనికి చెందిన మల్లాడి విజయ్‌భాస్కర్‌(38)కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని