దేవీపట్నంలో గోదావరి ఉద్ధృతి.. నీట మునిగిన గండి పోచమ్మ ఆలయం
eenadu telugu news
Updated : 24/07/2021 13:27 IST

దేవీపట్నంలో గోదావరి ఉద్ధృతి.. నీట మునిగిన గండి పోచమ్మ ఆలయం

దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం పెరగడంతో పోచమ్మగండి వద్ద ఉన్న గండి పోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. అమ్మవారి ఆలయం గోపురాన్ని వరద తాకింది. ఆలయంతో పాటు సమీపంలోని ఇళ్లు నీట మునిగాయి. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లోని 30 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం వద్ద గోదావరి నీటిమట్టం 30 మీటర్లకు చేరుకుంది.

దీంతో ముంపు గ్రామాలపై తీవ్ర ప్రభావం పడిందని ప్రజలు వాపోతున్నారు. గోదావరికి వరద పెరగడంతో ఆయా ప్రాంతాల్లో అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని