భర్తను కడతేర్చిన భార్య 
eenadu telugu news
Updated : 30/07/2021 05:17 IST

భర్తను కడతేర్చిన భార్య 


తండ్రి చిత్రపటం ముందు కన్నీరు పెడుతున్న కుమారుడు వినయ్‌

 

చంద్రగిరి గ్రామీణ, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం కారణంగా ఓ వివాహిత కట్టుకున్న భర్తను కడతేర్చింది. చివరకు తన భర్త కర్మక్రియలు జరుగుతుండగానే పోలీసులు ఆమెను అరెస్టు చేసిన సంఘటన అరిగిలవారిపల్లిలో చోటు చేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు.. పనపాకం పంచాయతీ అరిగిలవారిపల్లికి చెందిన వాసు (46) చిత్తూరు కలెక్టర్‌ కార్యాలయంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తూ శ్రీనగర్‌ కాలనీలో భార్య స్వప్నప్రియ, కుమారుడు వినయ్‌తో కలిసి ఉంటున్నాడు. చిత్తూరుకు చెందిన ఓ యువకునితో స్వప్నప్రియ చనువుగా ఉండటాన్ని గుర్తించిన భర్త వాసు పలుమార్లు మందలించాడు. ఈనెల 19వ తేదీన భార్య, భర్త మరోసారి గొడవ పడగా అప్పటికే మద్యం మత్తులో ఉన్న భర్త వాసును స్వప్నప్రియ కిందపడేసి గొంతుకు ఉరివేసి చంపింది. తన భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు అత్త తరఫు బంధువులకు చరవాణిలో సమాచారం ఇచ్చింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా గొంతు భాగంలో గాయాలను కప్పిపెట్టి మృత దేహాన్ని గ్రామానికి తీసుకొచ్చింది. తన తల్లిపై అనుమానంతో కుమారుడు వినయ్‌ తండ్రి మృత దేహాన్ని నిశితంగా గమనించగా.. గొంతుపై గాయాలు కనిపించాయి.దీంతో మృతుని తల్లి వసంతమ్మతో కలిసి చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన చంద్రగిరి పోలీసులు అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందినట్లు కేసు నమోదు చేసి చిత్తూరు రెండో పట్టణ పోలీసులకు బదలాయించారు. దీనిపై విచారణ చేపట్టిన చిత్తూరు పోలీసులు హత్యగా నిర్ధరించుకుని గురువారం అరిగిలవారిపల్లిలో మృతుని ఇంట కర్మక్రియలు జరుగుతుండగా స్వప్నప్రియను అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మరణించటం, కన్నతల్లి కటకటాల పాలవటంతో బాలుడు వినయ్‌ కన్నీటి పర్యంతమై తన తండ్రి చిత్రపటం ముందు బోరున విలపించటం అక్కడివారిచే కన్నీరు పెట్టించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని