మరింత అంకితభావంతో పనిచేయాలి
eenadu telugu news
Published : 29/07/2021 03:36 IST

మరింత అంకితభావంతో పనిచేయాలి

ప్రశంసాపత్రాన్ని అందజేస్తున్న సీనియర్‌ డీఎంఈ (డీజిల్‌)

గుంతకల్లు, న్యూస్‌టుడే: అవార్డులను అందుకున్న అధికారులు, సిబ్బంది మరింత అంకితభావంతో పనులు చేయాలని విద్యుత్తు నిర్వహణ విభాగం గుంతకల్లు డివిజన్‌ సీనియర్‌ డీఈఈ నరేష్‌, డీజిల్‌ షెడ్డు సీనియర్‌ డీఎంఈ పబిత్రకుమార్‌ నాయక్‌ అన్నారు. దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్‌ జోనల్‌ రైల్వే వారోత్సవాల సందర్భంగా గుంతకల్లు డివిజన్‌లో చీఫ్‌ ప్రిన్సిపల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరు అవార్డులను బుధవారం గుంతకల్లు ఇంజినీర్లు, సిబ్బందికి అందజేశారు. డీఆర్‌ఎం కార్యాలయంలోని సమావేశపు మందిరంలో అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. డివిజన్‌లో విద్యుత్తు విభాగంలో పనిచేస్తున్న 77 మంది అవార్డులను అందుకున్నారు. అధికారులు వర్చువల్‌ పద్ధతిలో సమావేశాన్ని నిర్వహించి, కొందరికి మాత్రమే వ్యక్తిగతంగా అవార్డులను అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని