హెచ్చెల్సీ లోకలైజేషన్‌ ఈఈగా రమణారెడ్డి
eenadu telugu news
Published : 29/07/2021 03:36 IST

హెచ్చెల్సీ లోకలైజేషన్‌ ఈఈగా రమణారెడ్డి

ఈఈ రమణారెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న ఇంజినీర్లు

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: హెచ్చెల్సీ లోకలైజేషన్‌ ఈఈగా ఎం.వి.రమణారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటిదాకా ఇన్‌ఛార్జి ఈఈగా దేసేనాయక్‌ పని చేశారు. హెచ్చెల్సీ జల్లిపల్లి సబ్‌ డివిజన్‌ డీఈగా పని చేస్తున్న రమణారెడ్డి బదిలీపై ఈఈగా నియమితులయ్యారు. ఇంజినీర్లు సూర్యనారాయణ, రమణ, రామసుబ్బయ్య, నార్పల శ్రీనివాసులు, శీను, ఆ డివిజన్‌ టీఓ చంద్రమ్మ, కార్యాలయ పర్యవేక్షకుడు ఉష్మాన్‌, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు తోట చెన్నప్ప, తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని