గోవధ నిషేధాన్ని అమలు చేయాలి
eenadu telugu news
Published : 29/07/2021 03:36 IST

గోవధ నిషేధాన్ని అమలు చేయాలి

గోవుతో విష్ణువర్ధన్‌రెడ్డి తదితరుల ప్రదర్శన

కదిరి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గోరక్షణ చట్టంపై వైకాపా నాయకుల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కదిరి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేశారు. గోవులను రక్షించాలంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శనగా తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటుబ్యాంకు రాజకీయాల కోసం హిందూ సమాజాన్ని చీల్చి, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి నోరు మెదపటం లేదని విమర్శించారు. హిందువులు, క్రైస్తవులను ఊచకోత కోసిన టిప్పుసుల్తాన్‌ విగ్రహం పెడతామంటే ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. రాష్ట్రం తగలబడుతుంటే ముఖ్యమంత్రి ఫిడేలు వాయిస్తున్నట్లు ఉందని ఆరోపించారు. జగనన్న కాలనీల్లో జగనన్న పడవల పథకం పెట్టాలని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో నాయకులు వజ్రభాస్కర్‌రెడ్డి, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని