కలకలం రేపిన ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
eenadu telugu news
Published : 29/07/2021 03:36 IST

కలకలం రేపిన ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

వైరలైన సెల్పీ వీడియో

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ఇంటినుంచి పారిపోయి కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి పరిసరాల్లో ఆత్మహత్యకు యత్నిస్తున్నామంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సెల్ఫీ వీడియో బుధవారం రాత్రి కలకలం రేపింది. కదిరి గ్రామీణ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలు.. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం కొటాల పంచాయతీ ఎగువబోయపల్లికి చెందిన మహేష్‌ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. వీరిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఇంటినుంచి పారిపోయారు. ప్రేమికులిద్దరూ కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి సమీపంలోని లఘువమ్మకొండ వద్ద సెల్ఫీవీడియో తీసుకుని పెద్దలు పెళ్లికి అంగీకరించనందున తాము ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సెల్ఫీ వీడియో వైరల్‌ కావడంతో కదిరి పోలీసులు అప్రమత్తమయ్యారు. కుమ్మరవాండ్లపల్లి పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఎలాంటి ఆచూకీ తెలియరాలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని