హెపటైటిస్‌ వైరస్‌ ప్రమాదకరం
eenadu telugu news
Published : 29/07/2021 03:36 IST

హెపటైటిస్‌ వైరస్‌ ప్రమాదకరం

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: హెపటైటిస్‌ వైరస్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన అవసరం. వైద్య సిబ్బంది కూడా తెలుసుకోవాలి. అప్పుడే తగిన వైద్య చికిత్స అందించేందుకు వీలుంటుందని సర్వజనాస్పత్రి వైద్య పర్యవేక్షకుడు డాక్టర్‌ జగన్నాథ్‌ పేర్కొన్నారు. బుధవారం ఆస్పత్రి లెక్చరరీ గ్యాలరీలో ప్రపంచ హెపటైటిస్‌ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెపటైటిస్‌ వైరస్‌ ఐదు రకాలుగా వ్యాప్తి చెందుతుంది. అందులో బి, సి రకాలు ప్రమాదకరం అన్నారు. కలుషిత నీరు, ఆహారం తినడం వల్లే ప్రబలుతాయి. వాన కాలంలో ఎక్కువగా వైరస్‌ తెరపైకి వస్తుందన్నారు. జనరల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ వీరభద్రయ్య మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముప్పై సెకన్లకు ఒకరు మృత్యువాత పడుతున్నారు. ఈ వైరస్‌ వల్ల లివర్‌కు ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందన్నారు. ఆర్‌ఎంఓ డాక్టర్‌ విశ్వనాథయ్య మాట్లాడుతూ వైరస్‌ వల్ల భయపడాల్సిన పని లేదు. ప్రాథమిక దశలోనే వైద్య చికిత్స అందించవచ్ఛు ఆస్పత్రికి వచ్చే వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ సమావేశంలో నేత్ర వైద్య విభాగం హెచ్‌ఓడీ ఆచార్య పల్లా శ్రీనివాసులు, నర్సింగ్‌ పర్యవేక్షకురాలు పుష్పలత, మేనేజర్‌ శ్వేత తదితరులు మాట్లాడారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని