‘ఉమాపై దాడి అనాగరికం’
eenadu telugu news
Published : 29/07/2021 03:36 IST

‘ఉమాపై దాడి అనాగరికం’

పెనుకొండ: తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైకాపా నాయకుల దాడి అనాగరిక చర్య అని హిందూపురం పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి అన్నారు. బుధవారం ఆయన పెనుకొండలోని తన నివాసంలో మాట్లాడుతూ స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు మైనింగ్‌ ప్రాంతాన్ని దేవినేని పరిశీలించారన్నారు. అక్కడ జరుగుతున్న అక్రమాలు బట్టబయలవుతుందనే భయంతో దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అచేతన స్థితిలో ఉందని బీకే విమర్శించారు. దేవినేనిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని