శబ్దంపై యుద్ధం
eenadu telugu news
Published : 29/07/2021 03:36 IST

శబ్దంపై యుద్ధం

సైలెన్సర్లు, హారన్లను రోడ్డు రోలర్‌తో తొక్కిస్తున్న డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: రయ్‌.. రయ్‌.. అంటూ వెళ్తుంటే చెవులు చిల్లులు పడుతుంటాయి. ఆ శబ్దాలకు పక్కన వెళ్లే వారు ప్రమాదాలకు గురవుతుంటారు. ప్రధాన రహదారులపైనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక కాలనీల్లో మరీ దారుణం. వీధుల్లో సైలెన్సర్‌ లేని బైక్‌లు, చెవులు పగిలిపోయే హారన్లతో నగరవాసులను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇలాంటి వాటిపై పోలీసులు యుద్ధం ప్రకటించారు. పెద్ద శబ్దాలు చేసే ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. సైలెన్సర్లు, హారన్లు తొలగించి స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్‌ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ ఎదుట కోర్టు రోడ్డుపై ఉంచి రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. నగరంలో కొందరు చోదకులు ద్విచక్ర వాహనాలకు కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లు తొలగించి వాటి స్థానంలో అతి పెద్ద శబ్దాలు చేసే వాటిని బిగిస్తున్నారు. వాహనాలు వెళ్లే సమయంలో వచ్చే పెద్ద శబ్దాలకు వృద్ధులు, గుండె జబ్బులు ఉన్న వారు, నిద్రిస్తున్న పిల్లలు ఉలిక్కి పడుతున్నారు. ధ్వని కాలుష్యం కలుగజేస్తున్నాయి. నగరంలోని పెద్ద సైలెన్సర్లు ఉన్న 166 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వాహన చోదకులకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో వాహన చోదకులు ట్రాఫిక్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని