బిరబిరా కృష్ణమ్మ
eenadu telugu news
Published : 29/07/2021 03:36 IST

బిరబిరా కృష్ణమ్మ

రాగులపాడు పంప్‌హౌస్‌ వద్ద జలాల ఎత్తిపోత

వజ్రకరూరు(ఉరవకొండ), న్యూస్‌టుడే: శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవా ప్రధాన కాలువలో కృష్ణా జలాలు జిల్లాలోకి ప్రవేశించాయి. బుధవారం సాయంత్రం వజ్రకరూరు మండలం రాగులపాడు పంప్‌హౌస్‌కు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఒక మోటారు నీటిని ఎత్తిపోస్తోంది. బెళుగుప్ప మండలం జీడిపల్లి జలాశయం దిశగా ప్రవహిస్తున్నాయి. రాత్రి ఉరవకొండ మండలానికి చేరాయి. గురువారం సాయంత్రానికి జీడిపల్లి జలాశయంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ప్రస్తుతం హంద్రీనీవా ప్రధాన కాలువలో 300 క్యూసెక్కుల మేర నీరు ప్రవహిస్తున్నట్లు సమాచారం. గురువారం ఉదయానికి ఆ నీటి సామర్థ్యం మరింత పెరిగే వీలుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని