వైద్య పరిశోధనలపై దృష్టి పెట్టండి
eenadu telugu news
Published : 29/07/2021 03:36 IST

వైద్య పరిశోధనలపై దృష్టి పెట్టండి

మాట్లాడుతున్న ప్రిన్సిపల్‌ నీరజ

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) మార్గదర్శకాల ప్రకారం ప్రతి విభాగంలోనూ విధిగా పరిశోధనలు సాగాలి. పీజీ వైద్యులు ఈ దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య నీరజ పేర్కొన్నారు. బుధవారం సామాజిక వైద్యశాస్త్ర విభాగం సారథ్యంలో వైద్య కళాశాల లెక్చరరీ హాలులో ‘సమన్వయ వైద్య విద్యా బోధన’ అన్న అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ ఇటీవల కొత్తగా పుట్టుకొచ్చిన బ్లాక్‌ఫంగస్‌పై లోతైన పరిశోధన సాగాలన్నారు. కొంతమంది పీజీ వైద్యులు ఆ దిశగా అడుగులు వేయడం అభినందనీయమన్నారు. కొత్తగా వచ్చే జబ్బులపై నిరంతర పరిశోధన చేయాలన్నారు. అప్పుడే రోగులకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. ఇక నుంచి అన్ని విభాగాల పీజీ వైద్యులు శ్రద్ధ పెట్టాలన్నారు. ఆగస్టులో పెథాలజీ విభాగం కూడా ఈ తరహా సదస్సు ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ సమావేశంలో ఆస్పత్రి ఉప వైద్య పర్యవేక్షకుడు ఆచార్య నవీద్‌ అహమ్మద్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ ఆచార్య ఉషాదేవి, ఎస్పీఎం విభాగం అధిపతి వాల్మీకి శ్రీనివాస్‌, ప్రొఫెసర్లు వి.శ్రీనివాసులు, పల్లా శ్రీనివాసులు, షంషాద్‌బేగం, సాయిసుధీర్‌, భవానీ, రవిప్రకాష్‌, శ్రీనివాసరావు, మహేశ్‌, శ్యాంప్రసాద్‌, ఆది నటేష్‌, యు.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని