సమన్వయంతో పనులు వేగవంతం
eenadu telugu news
Published : 29/07/2021 03:36 IST

సమన్వయంతో పనులు వేగవంతం

సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి, సబ్‌ కలెక్టర్‌ నవీన్‌

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా చూడాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణంపై కలెక్టర్‌, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నవీన్‌తో కలిసి బుధవారం సాయంత్రం మున్సిపల్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏడాదిలోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తే, పేదలకు శాశ్వత నివాసం అందించినట్లు అవుతుందని వివరించారు. మంజూరైన అన్ని ఇళ్లకు సంబంధించి, వెంటనే పునాదులు తవ్వించాలని, సెప్టెంబరు నాటికి బేస్‌మెంట్‌ స్థాయికి తీసుకురావాలని ఆదేశించారు. ప్రతి నిర్మాణం జియో ట్యాగింగ్‌ చేయాలని సూచించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, నీటి వసతి, విద్యుత్తు సరఫరా వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంటి నిర్మాణానికి ఉపయోగించే వస్తువుల ధరలు పెరగకుండా, ఇసుక సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో డ్వామా పి.డి. వేణుగోపాల్‌ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఇ.ఇ. చంద్రమౌళి రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని